Bengaluru CEO: కేరళ విద్యార్థి సూసైడ్ పై ఐడీ ఫ్రెష్ ఫుడ్ గ్లోబల్ సీఈవో పోస్టు

by Shamantha N |

కేరళ (Kerala)కు చెందిన ఓ విద్యార్థి ర్యాగింగ్ కు బలైన ఘటన కలకలం రేపుతోంది. అయితే, దీనిపైన ఐడీ ఫ్రెష్ ఫుడ్ గ్లోబల్ సీఈవో పీసీ ముస్తాఫా(iD Fresh Foods CEO PC Musthafa) ఆందోళన వ్యక్తం చేశారు.

Bengaluru CEO: కేరళ విద్యార్థి సూసైడ్ పై ఐడీ ఫ్రెష్ ఫుడ్ గ్లోబల్ సీఈవో పోస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ (Kerala)కు చెందిన ఓ విద్యార్థి ర్యాగింగ్ కు బలైన ఘటన కలకలం రేపుతోంది. అయితే, దీనిపైన ఐడీ ఫ్రెష్ ఫుడ్ గ్లోబల్ సీఈవో పీసీ ముస్తాఫా(iD Fresh Foods CEO PC Musthafa) ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ వల్ల తన బంధువు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. ‘‘అతడు నా మేనల్లుడు. నా కుమారుడికి బెస్ట్‌ ఫ్రెండ్‌. వయసు పదిహేనేళ్లు. నా కుమారుడితో సమానమైన అతను.. ఇప్పుడు ఈ లోకంలోనే లేడు. కిండర్ గార్డెన్ చదివే రోజుల్లో బెంగళూరులో కొన్నిరోజులు మాతోనే ఉన్నాడు. అతడి మృతి తర్వాత దారుణమైన విషయాలు బయటకొచ్చాయి. కలత పెట్టే వీడియోలు వైరల్ గా మారాయి. తోటి విద్యార్థుల్లో కొందరు అతడ్ని తిట్టారు. కొట్టారు. దారుణంగా ప్రవర్తించారు. తన రంగు గురించి హేళన చేశారు. స్కూల్‌లోనూ, స్కూల్‌ బస్‌లోనూ వేధించారు. చివరకు చనిపోయే ముందు కూడా ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అతడి మరణాన్ని సంతోషంగా భావించారని కొన్ని స్క్రీన్‌షాట్లతో తేలింది. అవన్నీ చూసిన తర్వాత నాకు ఏడుపు ఆగలేదు. 15 ఏళ్ల అబ్బాయితో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా..? అతడికి మృతికి న్యాయం చేయాలి’’ అని ముస్తఫా ఉద్వేగంగా పోస్ట్ పెట్టారు.

బాలుడి ఆత్మహత్య

జనవరి 15న కేరళలో పదిహేనేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలో తీవ్ర చర్చకు దారితీసింది. తమ కుమారుడు ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవలే సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థికి న్యాయం చేయాలని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Next Story