- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bullet train station: ఫస్ట్ భూగర్భ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ చూశారా! ముంబాయిలో భారీ స్టేషన్ టన్నెల్..
దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబాయి-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గాన్ని ముంబాయి-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జపాన్ సంస్థ టెక్నాలజీ సాయంతో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను భారత రైల్వే శాఖ నిర్మిస్తోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ద్వారా 508 కిలోమీటర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. (Mumbai) ముంబాయిలో దాదాపు 21 కిలోమీటర్లు భూగర్భం ద్వారా మార్గం నిర్మిస్తున్నారు. ఇందులో సముద్ర గర్భంలో 7 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్నారు. బంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగం.. థానే జిల్లాలోని శిల్‌ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. ప్లాట్‌ఫామ్, కన్‌కోర్స్, సర్వీస్ ఫ్లోర్ సహా మూడు అంతస్తుల రైల్వే స్టేషన్ (Underground bullet train station) నిర్మాణానికి పనులు చక చక జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా భూగర్భ సొరంగం పనులు దాదాపు 75 శాతం పైగా పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గుజరాత్ వైపు పనులు మరింత వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ముంబాయిలోని (Worli) వర్లిలో నిర్మిస్తున్న భూగర్భ రైల్వే స్టేషన్ పనుల వీడియోలు తాజాగా అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లోని మొదటి విభాగం 2026 లేదా 2027 నాటికి సిద్ధం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. 2028 నాటికి పూర్తి నిర్మాణం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇందులో భాగంగానే హైదరాబాద్-ముంబాయి, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్, అండర్‌గ్రౌండ్ మార్గాల్లో నిర్మించనున్నారు.






