- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bullet Train: నగరవాసులకు భారీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో త్వరలో బుల్లెట్ ట్రైన్!
నగరవాసులకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరవాసులకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు దేశంలోని మెయిన్ సిటీలను బుల్లెట్ ట్రైన్ల (Bullet Trains)తో లింక్ చేసే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ (Hyderabad)-ముంబై (Mumbai) మధ్య 709 కి.మీ మేర హై స్పీడ్ కారిడార్ (High Speed Corridor) నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అదే కారిడార్‌ను మరో బెంగళూరు (Bengaluru) వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో పాటు మైసూరు (Mysore)-చెన్నై (Chennai) మధ్య నిర్మించ తలపెట్టిన హై స్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ (Hyderabad) వరకు విస్తరించాలని అనుకుంటోంది. ఒకవేళ అదే జరిగితే.. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
కాగా, ప్రస్తుతం ముంబై (Mumbai-Ahmedabad) మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సాయంతో హైస్పీడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. అయితే, ఆ మార్గంలో జపాన్ (Japan) మేడ్ బుల్లెట్ ట్రైన్‌ను నడుపనున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలు హై స్పీడ్ కారిడార్‌లను నిర్మించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ (Elevated), భూగర్భ (Under Ground) మార్గాల్లో నిర్మిస్తారని ప్రాథమికంగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య దూరం 618 కి.మీ కాగా.. సాధారణ ట్రైన్‌లో హైదరబాద్ నుంచి బెంగళూరు వెళ్లందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇవ వందే భారత్‌లో 8 గంటల సమయం పడుతోంది. ఒక వేళ ఇదే రూట్లో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే.. కేవలం 2 గంటల్లోనే బెంగళూరుకు వెళ్లేలా హైస్పీడ్ కారిడార్లు ఎంతగానో దోహద పడనున్నాయి.






