Budget: 77 నిమిషాల పాటు సీతారామన్ ప్రసంగం.. రెండో అతి చిన్న స్పీచ్ ఇదే !

by B.Srinivas |   (  Updated:2025-02-01 08:29:03  IST  )

వరుసగా ఎనిమిదో సారి లోక్ సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక నిర్మలా సీతారామన్ 1 గంట 17 నిమిషాల పాటు ప్రసంగించారు.

Budget: 77 నిమిషాల పాటు సీతారామన్ ప్రసంగం.. రెండో అతి చిన్న స్పీచ్ ఇదే !
X

దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా ఎనిమిదో సారి లోక్ సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక నిర్మలా సీతారామన్ 1 గంట 17 నిమిషాల పాటు ప్రసంగించారు. 11:01 గంటలకు ప్రారంభమైన ప్రజెంటేషన్ 12.16 వరకు సాగింది. ప్రతిపక్షాలు నినాదాలు చేస్తు్న్నప్పటికీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఆమె 2020లో సుదీర్ఘంగా రెండు గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ఆ టైంలో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే స్పీచ్‌ను ముగించారు. అంతకుముందు 2019లో 2 గంటల 17 నిమిషాలు ప్రసంగించగా తన రికార్డును తానే అధిగమించారు. అత్పల్పంగా 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతన బడ్జెట్ సందర్భంగా 56 నిమిషాల పాటు ప్రసంగించారు. సీతారామన్ కంటే ముందు బీజేపీ నేత జస్వంత్ సింగ్ 2003లో 2 గంటల 15 నిమిషాల పాటు బడ్జెట్‌ను సమర్పించారు. కాగా, స్వతంత్ర భారత చరిత్రలో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో హిరూభాయ్ ఎమ్ పటేల్ చేశారు. ఆయన కేవలం 800 పదాల మధ్యంతర బడ్జెట్ స్పీచ్ ఇచ్చారు.

బడ్జెట్లలో సీతారామన్ ప్రసంగ సమయం

2019- 2 గంటల 17 నిమిషాలు

2020- 2 గంటల 40 నిమిషాలు

2021- 1 గంట 50 నిమిషాలు

2022- 1 గంట 32 నిమిషాలు

2023- 1 గంట 27 నిమిషాలు

2024 (ఫిబ్రవరి) - 56 నిమిషాలు (మధ్యంతర బడ్జెట్)

2024 (జూలై) - 1 గంట 25 నిమిషాలు

2025- 1 గంట 17 నిమిషాలు


Also Read...

పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట.. రూ.12 లక్షల వరకు నో ఇన్‌కం టాక్స్

Next Story