- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Congress: బడ్జెట్ నుంచి 'రైడ్ రాజ్, ట్యాక్స్ టెర్రరిజం' తొలగించాలి: కాంగ్రెస్ నేత జైరాం రమేష్

దిశ, నేషనల్ బ్యూరో: మరో పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రధాని మోడీ ప్రభుత్వ తిరోగమన విధానాలు దేశంలోని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, వ్యాపారం చేయడాన్ని అసౌకర్యంగా బీజేపీ ప్రభుత్వం మార్చింది. ఆదివారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీన్ని పరిష్కరించడానికి రాబోయే బడ్జెట్‌లో 'రైడ్ రాజ్, ట్యాక్స్ టెర్రరిజం' తొలగించాలని అన్నారు. దేశీయ తయారీ రంగంలోని ఉద్యోగాలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వేతనాలు, కొనుగోలు శక్తిని పెంచడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలన్నారు. దశాబ్ద కాలంగా 'ఈజ్ ఆఫ్ డూయింగ్' అని మోడీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. కానీ ఈ పదేళ్లలో ప్రవేట్ పెట్టుబడులు రికార్డు స్థాయికి పడిపోవడం మాత్రమే జరిగింది. అంతేకాకుండా భారీ సంఖ్యలో భారత్ నుంచి ఇతర దేశాలకు వ్యాపారవేత్తలు వెళ్లిపోవడం జరిగిందని జైరాం రమేష్ విమర్శలు చేశారు. జీఎస్టీ, ఆదాయపు పన్ను రెండింటినీ ఏకపక్ష పన్ను విధానంగా అభివర్ణించిన జైరాం రమేష్, ఇది పూర్తిగా పన్ను తీవ్రవాదానికి సమానమని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇది దేశానికి ఇదే అతిపెద్ద ముప్పు అన్నారు. 2022-2025 మధ్యకాలంలో 21,300 మంది సంపన్నులు దేశాన్ని విడిచిపెట్టారు. పన్ను రేట్లలో గందరగోళం కారణంగా రూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలు జరిగాయని, 2022-23 నాటితో పోలిస్తే ఇది రెట్టింపు అన్నారు. 18,000 మోసపూరిత సంస్థలు బయటపడ్డాయని, ఇంకా చాలా కంపెనీలు బయటపడాల్సినవి ఉన్నాయని వెల్లడించారు.