Budget: మాల్దీవులకు పెరిగిన బడ్జెట్.. ఈ ఏడాది ఎంత కేటాయించారంటే?

by B.Srinivas |   (  Updated:2025-02-01 11:10:34  IST  )

మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జూ ఎన్నికైన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య దౌత్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Budget: మాల్దీవులకు పెరిగిన బడ్జెట్.. ఈ  ఏడాది ఎంత కేటాయించారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జూ (Mohammad muizzu) ఎన్నికైన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య దౌత్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో మాల్దీవులకు భారత్ పెద్ద పీట వేసింది. గతంలో కంటే ఎక్కువ నిధులను కేటాయించింది. విదేశీ సహాయాల కోసం మొత్తంగా కేంద్రం రూ. 5,483 కోట్ల రూపాయలను కేటాయించింది. అంతకుముందు ఇది రూ. 5,806 కోట్లు ఉండగా స్వల్పంగా తగ్గించింది. అత్యధికంగా భూటాన్ కు రూ.2,150 కోట్లు, మాల్దీవులకు రూ.600 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, నేపాల్‌కు రూ. 700 కోట్లు, మయన్మార్‌కు రూ. 350 కోట్లు, ఆప్ఘనిస్థాన్‌కు రూ. 100 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా మంగోలియాకు రూ.5 కోట్లు కేటాయించారు. ఇక, మారిషస్ కు రూ. 500 కోట్లు, ఆఫ్రికన్ దేశాలకు రూ. 225 కోట్లు కేటాయించారు. అయితే మాల్దీవులకు గతేడాది బడ్జెట్ లో రూ.470 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో 28 శాతం పెరగడం గమనార్హం.

ఆఫ్ఘనిస్తాన్ సహాయం డబుల్

ఆఫ్ఘనిస్తాన్‌కు గతేడాది రూ. 50 కోట్ల కేటాయించగా, ప్రస్తుతం రూ. 100 కోట్లకు పెంచారు. అయితే రెండేళ్ల క్రితం మంజూరు చేసిన రూ.207 కోట్లతో పోలిస్తే ఇది తక్కువ. మానవతా సహాయం, ఆర్థిక సహకారానికి దాని భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తూ, తాలిబాన్ ప్రభుత్వంతో భారత్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంది. అయితే భారత్ ఇప్పటికీ తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. ఇక, మయన్మార్‌కు సైతం కాస్త నిధులు తగ్గాయి. గతేడాది రూ.400 కోట్ల ఉండగా ఈ ఏడాది రూ.350 కోట్లకు తగ్గింది. అయితే గతేడాది నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకలకు కేటాయింపుల్లో ఎలాంటి మార్పు లేదు.


Also Read...

Disha Special: భారతదేశాన్ని మలుపుతిప్పిన అత్యంత ముఖ్యమైన బడ్జెట్లు

Next Story