- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రాహ్మణులను అవమానిస్తే ఊరుకోం! వెబ్ సిరీస్‌పై బీఎస్పీ అధినేత మాయావతి సంచలన ట్వీట్
సినిమాల్లో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా చిత్రీకరించడంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమాల్లో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా చిత్రీకరించడంపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులవివక్షను ప్రేరేపించేలా ఉన్న ‘ఘూస్‌ఖోర్ పండిత్’ (అవినీతి పండితుడు) వెబ్ సిరీస్‌ను తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆమె సంచలన ట్వీట్ చేశారు.
సమాజానికి అవమానం...
మాయావతి తన ట్వీట్‌లో పేర్కొంటూ.. ‘గత కొంతకాలంగా కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా, సినిమాల్లో కూడా బ్రాహ్మణులను ‘పండిత్’ అని సంబోధిస్తూ, వారిని లంచగొండులుగా చూపించడం అత్యంత విచారకరం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సమాజాన్ని అవమానించడమే. దీనివల్ల ఆ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.’ అని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా, ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపేలా తీస్తున్న సినిమాలను, వెబ్ సిరీస్‌లను తమ పార్టీ (బీఎస్పీ) తీవ్రంగా ఖండిస్తోందని ఆమె పేర్కొన్నారు. వివాదాస్పదంగా మారిన ‘ఘూస్‌ఖోర్ పండిత్’ వెబ్ సిరీస్‌పై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
పోలీసుల చర్యలపై ప్రశంస
ఈ వ్యవహారంపై లక్నో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడం సరైన చర్య అని, ఇలాంటి విద్వేషపూరిత కంటెంట్‌పై కఠినంగా వ్యవహరించాలని మాయావతి స్పష్టం చేశారు. కులాభిమానాలను దెబ్బతీస్తూ, సమాజంలో వైషమ్యాలు సృష్టించే ఇటువంటి ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.






