BSNL: అతితక్కువ రీఛార్జ్‌తో 70 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్

by Geesa Chandu |   (  Updated:2024-08-04 14:30:18  IST  )

ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, జియో నెలవారి రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఖరీదైనవిగా మారటంతో మొబైల్ వినియోగదారులందరూ మరోసారి ప్రభుత్వరంగంలోని ప్లాన్ ల వైపు మొగ్గుచూపుతున్నారు.

BSNL: అతితక్కువ రీఛార్జ్‌తో 70 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, జియో నెలవారి రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఖరీదైనవిగా మారటంతో మొబైల్ వినియోగదారులందరూ మరోసారి ప్రభుత్వరంగంలోని ప్లాన్ ల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ లో రూ.200 కంటే తక్కువ ధరలోనే రెండు ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ప్లాన్ లో 60 రోజుల వాలిడిటీ లభిస్తే, మరో ప్లాన్ లో 70 రోజుల వాలిడిటీ లభిస్తుంది. చాలా కాలంగా.. టెలికాం కంపెనీలకు పెరుగుతున్న నష్టాల కారణంగా దేశంలోని మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు గత నెలలో తమ డేటా, కాలింగ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. అప్పటి నుండి మొబైల్ వినియోగదారులు నిత్యం కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రణాళికలతో వారు చాలా సంతోషంగా ఉన్నారు.

ఇక్కడ మీరు బీఎస్ఎన్ఎల్ డేటా మరియు కాలింగ్ ప్లాన్ లు గమనిస్తే.. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4G ఇంటర్ నెట్, ఎస్‌ఎంఎస్‌, కాలింగ్ సౌకర్యాలు లభిస్తాయి. మీరు కనుక మీ జియో, ఎయిర్టెల్ లేదా వొడాఫోన్-ఐడియా నంబర్ ను బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చెయ్యాలనుకుంటే మీకు రూ.200 కంటే తక్కువ ధరలోనే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.197 ప్లాన్ లో..

వినియోగదారులకు 70 రోజుల వాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌తో ప్రతిరోజూ 2GB తో 4G డేటాను అందిస్తుంది. ఈ డేటా మొదటి 15 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీకు 40kbps ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. మీరు ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో Zing మ్యూజిక్ కంటెంట్‌ను కూడా పొందవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.108 ప్లాన్ లో..

ఇందులో 28 రోజుల వాలిడిటీతో, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1 GB డేటాను అందిస్తుంది. కానీ దీంట్లో ఎస్‌ఎంఎస్‌లు ఉండవు. అయితే, ఇక్కడ లభించే ప్రయోజనాలు మాత్రం ఇతర కంపెనీ ప్లాన్‌ల కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు.

Next Story