- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ 2.O కోసం సిద్ధంగా ఉన్నాం.. BSF సంచలన ప్రకటన
ఆపరేషన్ సిందూర్ 2.O కోసం తాము సిద్ధంగా ఉన్నామని బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. బీఎస్ఎఫ్ ఐజీ శశాంక్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ 2.O కోసం తాము సిద్ధంగా ఉన్నామని బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. బీఎస్ఎఫ్ ఐజీ శశాంక్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము 118 పాకిస్థానీ పోస్టులను, బహుళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ కొట్టిన దెబ్బ నుండి పాకిస్థాన్ ఇంకా కోలుకోలేదని అన్నారు. పాకిస్థాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 72 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లను బార్డర్ నుండి చాలా దూరంగా వెనక్కి తీసుకువెళ్లిందన్నారు.
పాకిస్థాన్ లేదా ఉగ్రవాద సంస్థలు నియంత్రణ రేఖ లేదా సరిహద్దు వెంట కయ్యానికి కాలు దువ్వితే భారత్ మరింత బలంగా ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. అప్ గ్రేడ్ చేసిన డ్రోన్లు, యూఏవీలు మరియు నిఘా వ్యవస్థలతో జమ్మూ గతంలో కంటే మరింత సురక్షితంగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ 2.O కోసం తాము సిద్ధంగా ఉన్నామని, ఢిల్లీ నుండి ఆదేశాలు రావడమే ఆలస్యం అని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ అనేది ఉగ్రవాద నిరోధక చర్య మాత్రమేనని యుద్ధం కాదని చెప్పారు.






