Bsf: బీఎస్ఎఫ్ జవాన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్.. వెలుగులోకి కీలక విషయాలు

by B.Srinivas |

పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్థాన్ సైనికులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Bsf: బీఎస్ఎఫ్ జవాన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్.. వెలుగులోకి కీలక విషయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ (India pakisthan) ఉద్రిక్తతల నేపథ్యంలో పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించిన బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) జవాన్ పూర్ణం కుమార్ షా (Purnam kumar shah)ను పాకిస్థాన్ సైనికులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 21రోజుల పాటు కస్టడీలో ఉన్న ఆయనను తాజాగా భారత్‌కు అప్పగించారు. అయితే పాక్ చెరలో ఉండగా జవాన్‌ను చిత్ర హింసలకు గురి చేసినట్టు తెలుస్తోంది. పాక్ వద్ద ఉన్నన్ని రోజులు ఆయన కళ్లకు గంతలు కట్టే ఉంచారని, నిద్ర కూడా పోనివ్వకుండా ఇబ్బంది పెట్టినట్టు సమాచారం. అంతేగాక నిరంతరం దుర్భాషలాడారని, బార్డర్‌లో సైన్యం మోహరింపుపై పలు ప్రశ్నలు అడిగి విసిగించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

పళ్లు తోముకోవడానికి కూడా అనుమతివ్వలేదు. అలాగే నిర్బంధంలో ఉన్నంత కాలం పాకిస్తాన్‌లోని మూడు గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఈ టైంలో ఎక్కువగా కళ్ళకు గంతలు కట్టి ఉంచారని, మరో ప్రదేశంలో జైలు గదిలోనే ఉంచారని, సరిహద్దు వద్ద మోహరించిన సీనియర్ ఆర్మీ అధికారుల వివరాలు సైతం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. కాగా, భారత్ కు వచ్చిన వెంటనే పూర్ణం కుమార్‌ను వైద్య పరీక్షలకు పంపించగా విచారణ తర్వాత ఆయన ఇంటికి వెళ్లడానికి అనుమతించినట్టు తెలుస్తోంది.

Next Story