BSF: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. బీఎస్ఎఫ్ కీలక ప్రతిపాదన

by B.Srinivas |

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.

BSF: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. బీఎస్ఎఫ్ కీలక ప్రతిపాదన
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో సాయుధ బలగాల పోరాటానికి గుర్తుగా సాంబా సెక్టార్‌లోని ఒక పోస్టుకు ‘సిందూర్’ పేరు పెట్టాలని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అంతేగాక మే 10వ తేదీన పాక్ జరిపిన కాల్పుల్లో అమరులైన ఇద్దరు జవాన్ల పేరు మరో రెండు పోస్టులకు పెట్టాలని తెలిపింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ జమ్మూ ఫ్రాంటియర్ ఐజీ శశాంక్ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. సరిహద్దులో పాక్ షెల్లింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో భారత ఆర్మీ నాయక్ సహా ముగ్గురు జవాన్లు మరణించారని తెలిపారు. సాంబా సెక్టార్‌లో మేము కోల్పోయిన మా సిబ్బందికి గుర్తుగా రెండు పోస్టులకు వారి పేరు పెట్టాలని, అంతేగాక మరొక పోస్టుకు సిందూర్‌గా నామకరణం చేయాలని తాము సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఫార్వర్డ్ పోస్టుల వద్ద పోరాడిన మహిళా సిబ్బందిని ఆనంద్ ప్రశంసించారు. ఉద్రిక్తతలు తగ్గాక ఉగ్రవాదులు తమ లాంచ్ ప్యాడ్‌లు, శిబిరాలకు తిరిగి వస్తున్నారని తెలిపారు. ఎల్‌ఓసి వెంట చొరబాటుకు అవకాశం ఉందని మాకు సమాచారం అందుతోందని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దానికి దీటుగా స్పందించేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు పూర్తి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Next Story