BSF: స్మగ్లింగ్‌కు యత్నించిన బంగ్లాదేశీయులు.. కట్టడి చేసిన బీఎస్‌ఎఫ్‌

by Shamantha N |

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని బంగ్లాదేశీయులు స్మగ్లింగ్ కు యత్నించారు. దీంతో, అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళాలు స్మగ్లర్లను అడ్డుకున్నాయి.

BSF: స్మగ్లింగ్‌కు యత్నించిన బంగ్లాదేశీయులు.. కట్టడి చేసిన బీఎస్‌ఎఫ్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని బంగ్లాదేశీయులు స్మగ్లింగ్ కు యత్నించారు. దీంతో, అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళాలు స్మగ్లర్లను అడ్డుకున్నాయి. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పలుమార్లు హెచ్చరించినప్పటికీ 15 నుంచి 20 మందితో కూడిన స్మగ్లర్ల బృందం భారత సరిహద్దులవైపునకు దూసుకొచ్చింది. మారణాయుధాలతో జవాన్లపై దాడి చేశారు. దీంతో, జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. అదనపు బలగాలు మోహరించడంతో స్మగ్లర్లు పారిపోయారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించి.. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 572 ఫెన్సిడైల్ బాటిల్స్, హైబీమ్ ప్లాష్ లైట్, ఆయుధాలు లభ్యం అయ్యాయి. అయితే, భద్రతాబలగాల దాడిలో స్మగ్లర్లు గాయపిడనట్లు తెలుస్తోంది. ఇకపోతే, పశ్చిమబెంగాల్ లోని మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సరిహద్దు అవుట్‌పోస్టులలో ఇలాంటి స్మగ్లింగ్స్, చొరబాటు యత్నాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే, బీఎస్ఎఫ్ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లలో నివేదికలు దాఖలు చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగించారు.

Next Story