BSF Jawan: ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు.. మరో బీఎస్ఎఫ్ జవాన్ మృతి

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్ సరిహద్దు వద్ద పాక్ కాల్పుల్లో గాయపడిన మరో బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.

BSF Jawan: ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు.. మరో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) సరిహద్దు వద్ద పాక్ కాల్పుల్లో గాయపడిన మరో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్( బీఎస్ఎఫ్) జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. బిహార్‌లోని సివాన్ జిల్లా వాసిల్ పూర్ గ్రామానికి చెందిన రాంబాబు ప్రసాద్ (28) అనే బీఎస్ఎఫ్ సైనికుడు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద విధులు నిర్వహిస్తుండగా ఈ నెల 9న పాక్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రసాద్‌కు వివాహమైనట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాంబాబు మరణంతో వాసిల్ పూర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. అంతకుముందు బిహార్‌లోని చాప్రాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మహ్మద్ ఇంతియాజ్ సైతం పాక్ జరిపిన కాల్పుల్లో గాయపడి మరణించిన విషయం తెలిసిందే.

Next Story