BSF: బీఎస్ఎఫ్‌కు 5000 బాడీ కెమెరాలు.. చొరబాట్లను నియంత్రించడమే లక్ష్యం !

by B.Srinivas |   (  Updated:2025-07-27 16:52:16  IST  )

బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

BSF: బీఎస్ఎఫ్‌కు 5000 బాడీ కెమెరాలు.. చొరబాట్లను నియంత్రించడమే లక్ష్యం !
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద సెక్యురిటీ ఉన్న బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) బలగాలకు 5000 బాడీ కెమెరాలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే అలాగే మరి కొన్ని ఔట్ పోస్టుల్లో విదేశీయుల రిజిస్ట్రేషన్ కార్యాలయ డేటాను పంచుకోవడానికి ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్‌ పరికరాలను అందించనుంది. గతేడాది బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బార్డర్‌లో సెక్యురిటీని పెంచారు. ఈ క్రమంలోనే బీఎస్ఎఫ్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి రెండు విధాన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమగ్రంగా సమీక్షించిన తర్వాత బీఎస్ఎఫ్ ఈ రెండు ప్రతిపాదనలు తీసుకురాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దానికి ఆమోదం తెలిపినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కెమెరాలు రాత్రిపూట దృష్టిని కలిగి ఉండనుండగా, దాదాపు 12-14 గంటల ఫుటేజీని ఇవి రికార్డు చేయనున్నాయి.

Next Story