ఆన్‌లైన్ గేమ్.. లక్షలు పోగొట్టుకున్న స్టూడెంట్ సూసైడ్..

by Sujitha Rachapalli |

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. హల్ద్వానీకి చెందిన బీఎస్సీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ హర్షితా జోషి ఆత్మహత్య చేసుకుంది. ఆన్‌లైన్ లూడో గేమ్ ఆడిన ఆమె.. ఐదు లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపంతో తన గదిలో ఉరేసుకుని చనిపోయింది.

ఆన్‌లైన్ గేమ్.. లక్షలు పోగొట్టుకున్న స్టూడెంట్ సూసైడ్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. హల్ద్వానీకి చెందిన బీఎస్సీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ హర్షితా జోషి ఆత్మహత్య చేసుకుంది. ఆన్‌లైన్ లూడో గేమ్ ఆడిన ఆమె.. ఐదు లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపంతో తన గదిలో ఉరేసుకుని చనిపోయింది. తల్లి, సోదరుడు మార్కెట్‌కు వెళ్లిన సమయంలో సూసైడ్ చేసుకోగా.. తిరిగొచ్చేసరికి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. కాగా సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరించింది. ముందు ఆడినప్పుడు భారీ లాభాలు రావడంతో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టానని.. తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బు పూర్తిగా జూదంలో పోయిందని నోట్‌లో పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు కేసును విచారిస్తున్నారు. ఇక హర్షిత తండ్రి ప్రేమానంద్ జోషి పోలీసు కాగా అల్మోరాలో పోస్టింగ్‌లో ఉన్నాడు.

Next Story