- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతి దారుణ హత్య.. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘటన!
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బరేలీలోని ప్రీత్ ప్యాలెస్ అనే హోటల్ లో 28 ఏళ్ల యువతి రక్తపు మడుగులో శవమై కనిపించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ ఆలం అనే వ్యక్తి ఐడీ ని ఉపయోగించి బుక్ చేసిన హోటల్ గదిలో.. మహిళ శవమై కనిపించింది. అయితే ప్రస్తుతం ఆలం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బరేలీ హోటల్ లోని ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ గదిలో మహిళ గొంతు కోసి దారుణంగా హత మార్చారు. మృతురాలి బట్టలు చిందరవందరగా ఉండి, మృతదేహం పక్కన బుర్ఖా కూడా పడి ఉందని తెలిపారు. దాంతో ఆమె ముస్లిం మహిళ అయి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ కేసుకు సంబంధించి, చనిపోయిన మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపినట్లు అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని తెలిపారు. మృతురాలికి, మహమ్మద్ ఆలం అనే వ్యక్తికి గల సంబంధాన్ని గురించి, పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారులు వెల్లడించారు.






