Brutal Incident: టీచర్ల.. కీచకులా..? బాలిక పై ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులు

by Ramesh Goud |   (  Updated:2025-02-06 06:38:13  IST  )

బాలిక (girl)పై ముగ్గురు ఉపాధ్యాయులు (three teachers) అత్యాచారానికి (raping) పాల్పడిన దారుణ ఘటన (brutal incident) తమిళనాడు (Tamil Nadu)లో చోటు చేసుకుంది.

Brutal Incident: టీచర్ల.. కీచకులా..? బాలిక పై ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులు
X

దిశ, వెబ్ డెస్క్: బాలిక (girl)పై ముగ్గురు ఉపాధ్యాయులు (three teachers) అత్యాచారానికి (raping) పాల్పడిన దారుణ ఘటన (brutal incident) తమిళనాడు (Tamil Nadu)లో చోటు చేసుకుంది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్లే బాలిక అని చూడకుండా లొంగదీసుకొని చెరబట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటన ప్రకారం తమిళనాడు కృష్ణగిరి (Krishnagiri) సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల (Government School)లో 13 ఏళ్ల బాలిక (13-year-old girl) 8వ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా బాలిక పాఠశాలకు రావడం లేదు.

దీనిపై స్నేహితులు సహా స్కూల్ ప్రిన్సిపాల్ (school principal) తనని ప్రశ్నించగా.. దాటవేత ధోరణితో సమాధానం చెప్పుకొచ్చింది. ఇక బాలిక పాఠశాలకు రాకపోవడంపై తల్లిదండ్రులకు ఆరా తీసేందుకు స్కూల్ ప్రిన్సిపాల్ బాలిక ఇంటికి వెళ్లాడు. ఏమైందని విద్యార్థి తల్లిని అడగగా.. అసలు బాగోతం బయటికి వచ్చింది. పాఠశాలలో తన కుతూరికి జరిగిన అన్యాయాన్ని ప్రిన్సిపాల్ తో చెప్పుకొని బాలిక తల్లి బాధపడింది. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ (abortion) చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పింది. దీనికి కారణం స్కూల్ లో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులేనని, చిన్నస్వామి(57), ఆరుముగం(45), ప్రకాశ్(37) అనే టీచర్లు తన బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పడంతో స్కూల్ ప్రిన్సిపాల్ షాక్ (shocked)కు గురయ్యాడు. ఘటనపై ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించి, బాలిక తల్లిదండ్రుల (girl's parents)తో ఫిర్యాదు చేయించారు. దీంతో పోలీసులకు ఆ ముగ్గురు కీచక టీచర్ల (three teachers)ను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.

Next Story