- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kerala: - కోజికోడ్ లో హత్యకు గురైన విద్యార్థి పోస్టుమార్టం నివేదికలో బయటపడ్డ సంచనాలు
కేరళలోని కోజికోడ్ జిల్లాలో దారుణంగా దాడికి గురై చనిపోయినన విద్యార్థి పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని కోజికోడ్ జిల్లాలో దారుణంగా దాడికి గురై చనిపోయినన విద్యార్థి పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం నివేదికలో యువకుడిపై ఏ తీవ్రతలో దాడి జరిగిందో తెలిసింది. యువకుడి పుర్రె విరిగిందని, అతడి ముక్కుపై, ఎడమ కన్ను కింద తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడైంది. అంతేకాకుండా, శరీరమంతా గాయాలైనట్లు తెలిసింది. అతడి ఛాతిపై బలంగా దాడి చేయడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని డాక్టర్లు తెలిపారు.
అసలేం జరిగింటందే?
కేరళలోని కోజికోడ్ తామరస్సేరిలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ సమీపంలో కొందరు విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఫిబ్రవరి 23న పాఠశాలలో జరిగిన వీడ్కోలు పార్టీకి సంబంధించి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే రెండు వేర్వేరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాగ్వాదానికి దిగడం వల్ల ఈ ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ పదో తరగతి విద్యార్థి తలకు తీవ్రంగా గాయమైంది. కాగా, తీవ్ర గాయాలపాలైన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. కాగా.. ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించిన వాట్సాప్ మెసేజ్‌ను గుర్తించిన పోలీసులు అందుకు కారణమైన ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వారిని జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.






