- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UK PM: HIV టెస్టు చేయించుకున్న బ్రిటన్ ప్రధాని.. ఎందుకో తెలుసా?
సాధారణంగా సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు అధికంగా వ్యాపిస్తుంటే ప్రజలకు వాటిపై అవగాహన కల్పించేందుకు అధికారులు ఆయా ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాట్లు చేస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు అధికంగా వ్యాపిస్తుంటే ప్రజలకు వాటిపై అవగాహన కల్పించేందుకు అధికారులు ఆయా ప్రాంతాల్లో బ్యానర్లు ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగే, టీవీల్లో, మీడియాలో ప్రకటనలు వంటివి ఇస్తుంటారు. కానీ, బ్రిటన్ (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) మాత్రం తమ దేశ ప్రజలకు HIV టెస్టుపై అవగాహన కల్పించేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా HIV పరీక్ష చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే, HIV పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా కీర్ స్టార్మర్ రికార్డ్ సృష్టించారు. ఈ విషయాన్ని యూకే ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
2025లో కొత్త హెచ్‌ఐవీ కేసులను నిర్మూలించడానికి యూకే ప్రభుత్వం కొత్త కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా వేసవి కాలంలో HIV పరీక్షల కార్యక్రమం ప్రారంభించింది. ఈ సందర్భంగా HIV పరీక్ష గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ (Terrence Higgins Trust) ప్రతినిధులు ముందుకొచ్చారు. వారితో కలిసి ఇంట్లోనే ప్రధాని స్టార్మర్ రాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ HIV పరీక్ష ఎంతో ముఖ్యమైనదని, ఇందులో పాల్గొనటం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. కొన్ని క్షణాల్లో పూర్తయ్యే ఈ పరీక్షను ఒక వారం పాటు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. 2030 నాటికి కొత్త హెచ్ఐవీ కేసులు నమోదు కాకూడదనే లక్ష్యాన్ని అందుకోవడానికి అందరూ ముందుకొచ్చి టెస్టు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
It’s my mission to end new HIV transmissions by 2030.
— Keir Starmer (@Keir_Starmer) February 10, 2025
You can get a HIV test delivered to your home. It’s free, quick and easy to do.#HIVTestingWeek pic.twitter.com/mrPkKZig5E






