ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన.. అధికారులకు సీఎం ఫడ్నవీస్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-15 14:56:40  IST  )

మహారాష్ట్ర (Maharashtra)లోని పూణే (Pune) కుందంలాలో ఇంద్రాయణి నది (Indrayani River)పై ఉన్న పాత ఇనుప వంతెన కుప్పకూలిన విషయం తెలిసిందే.

ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన.. అధికారులకు సీఎం ఫడ్నవీస్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లోని పూణే (Pune) కుందంలాలో ఇంద్రాయణి నది (Indrayani River)పై ఉన్న పాత ఇనుప వంతెన కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ మేరకు ఎన్‌డీఆర్ఎఫ్‌ (NDRF)కు చెందిన రెండు టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రాయణి బ్రిడ్జ్ కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) స్పందించారు. ప్రమాదం విషయం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనా స్థలంలో ఉన్న డివిజనల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, సీపీ, తహశీల్దార్‌ను తాను నిరంతరం సంప్రదిస్తున్నానని పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన సెర్చ్ ఆపరేషన్ కొనసాగించానలి అధికారులకు ఆదేశాలు జరీ చేసినట్లుగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

Next Story