పెళ్లివేదికపై అతిథి ప్రాణం కాపాడిన వధువు.. ఎలాగంటే? వీడియో వైరల్

by Ramesh Naini |

కొల్హాపూర్ జిల్లా బండివాడేలో జరిగిన ఓ శుభకార్యం ఒక్కసారిగా ఉత్కంఠ భరిత దృశ్యంగా మారింది.

పెళ్లివేదికపై అతిథి ప్రాణం కాపాడిన వధువు.. ఎలాగంటే? వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొల్హాపూర్ జిల్లా బండివాడేలో జరిగిన ఓ శుభకార్యం ఒక్కసారిగా ఉత్కంఠ భరిత దృశ్యంగా మారింది. మొదట నవ్వులు, సంతోషాలు నిండిపోయిన ఆ పెళ్లి వేదికపై అకస్మాత్తుగా గందరగోళం నెలకొంది. అతిథిగా వచ్చిన ఓ మహిళ తల తిరిగినట్లు భావించి, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నవారు ఏమి జరిగిందో అర్థం కాని స్థితిలో గందరగోళానికి గురయ్యారు. కానీ ఆ సమయంలో వేదికపై వధువు ధైర్యమే మహిళను కాపాడింది.

పెళ్లి కూతురు, వృత్తి రీత్యా డాక్టర్. ఆపదలో ఉన్న అతిథిని చూసిన వెంటనే వేడుకలను కాసేపు పక్కన బెట్టి, సకాలంలో స్పందించి ఆమె పల్స్‌ చెక్ చేయడం, శ్వాసస్థితి పరిశీలించడం వంటివి క్షణాల్లో ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితిని పూర్తిగా నియంత్రించింది.

మహిళను అపస్మారక స్థితి నుంచి బయటకు తీసిన వెంటనే వేదికపై చప్పట్ల సందడి. డాక్టర్‌ వధువు అంటూ బంధువులు ప్రశంసలతో ముంచేత్తారు. ఈ మొత్తం ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. వీడియోలో పెళ్లి కొడుకు ఒక మూలకు నిలబడి వధువు చేసే చికిత్సను చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూవీల్లో మాత్రమే అనుకున్నాం.. కానీ రియల్ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలించింది. డాక్టర్ అంటే సేవ చేయడం.. రోజు ఏదైనా సరే అంటూ మరో నెటిజన్ కామెంట్ తెలిపారు. వీడియో ఇదే..

Next Story