BREAKING: కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

by Shiva |
BREAKING: కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కే.నట్వర్ సింగ్ (93) శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. కాగా, నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో జన్మించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-05 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1966 నుంచి 1971 వరకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ కార్యాలయంలో పని చేసిన అతి ముఖ్యమైన వ్యక్తుల్లో నట్వర్ సింగ్ ఒకరు. అదేవిధంగా భారత్, పాకిస్థాన్ మధ్య రాయబారిగా కూడా కొన్నాళ్ల పాటు పని చేశారు. ఆయన పలు పుస్తకాలను కూడా రచించారు. 1984లో కేంద్రం నట్వర్‌సింగ్‌ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. అదివారం ఢిల్లీలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.



Next Story