BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌కు ఆరు రోజుల కస్టడీకి అనుమతి

by Disha Web Desk 1 |
BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌కు ఆరు రోజుల కస్టడీకి అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. కేజ్రీవాల్‌ను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. మళ్లీ ఈ నెల 28న తిరిగి కోర్టులో అప్పగించాలని ఆదేశించింది. కాగా, లిక్కర్ స్కాం కేసులో గత రాత్రి ఈడీ తనను అరెస్టు చేసిన కేసులో బెయిల్ కోరుతూ.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు నుంచి ఆయన ఉపసంహరించుకున్నారు. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు ఢిల్లీ సీఎం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే, ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆమెకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కవితను కోరింది.

Next Story

Most Viewed