- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > BREAKING: తమిళనాడులో ఘాతుకం.. మేక మెడలో అన్నామలై ఫొటో వేసి నరికిన డీఎంకే నాయకులు
BREAKING: తమిళనాడులో ఘాతుకం.. మేక మెడలో అన్నామలై ఫొటో వేసి నరికిన డీఎంకే నాయకులు
తమిళనాడులో ఘాతుకం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘాతుకం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓటమి పాలయ్యారు. అయితే, అధికారంలో డీఎంకే నాయకులు గురువారం ఉదయం ఆయన ఓటమిని అత్యంత పైశాచికంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏకంగా ఓ మేక మెడలో అన్నామలై ఫొటో వేసి నడిరోడ్డుపై ఒకే వేటుతో మేక మెడను నరికేశారు. ఈ ఘటన స్పందించిన బీజేపీ నాయకత్వం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది. వేడుక చేసుకునేందుకు చాలా దారులు ఉన్నాయని, మూగ జీవాలను హింసించడం సరికాదని వారు మండిపడ్డారు. జరిగిన ఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించి బాధ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






