Brahmos: ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణిదే కీలక పాత్ర.. రాజ్‌నాథ్ సింగ్

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ టైంలో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు.

Brahmos: ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణిదే కీలక పాత్ర.. రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) టైంలో బ్రహ్మోస్ క్షిపణి (Brahmos missile) కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath singh) కొనియాడారు. ఆపరేషన్ అనంతరం నుంచి డజనుకు పైగా దేశాలు దానిపై ఆసక్తి చూపాయని తెలిపారు. లక్నోలోని నేషనల్ పీజీ కళాశాలలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం చంద్రభాను గుప్తా విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఆయనకు నివాళిగా పోస్టల్ స్టాంపును సైతం రిలీజ్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్ పాక్ ఘర్షణలో బ్రహ్మోస్ మిస్సైల్ అద్భుతం చేసిందని, దీంతో ప్రపంచంలోని 14 నుంచి 15 దేశాలు దానిని కావాలని డిమాండ్ చేశాయన్నారు.

బ్రహ్మోస్ క్షిపణిని లక్నో నుంచి కూడా ఎగుమతి చేస్తారని, ఈ సౌకర్యం దేశ రక్షణ రంగంలో స్వావలంబనను బలోపేతం చేస్తుందన్నారు. దీనివల్ల ఉపాధి కూడా కలుగుతుందని తెలిపారు. బలమైన శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాల పటిష్టత కారణంగా ఉత్తరప్రదేశ్ మరిన్ని పరిశ్రమలను ఆకర్షిస్తోందన్నారు. చంద్రభాను గుప్తా స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమై తన త్యాగం, నిబద్ధత, నాయకత్వం ద్వారా లక్షలాది మంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారని ప్రశంసించారు.

Next Story