- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BR Gavai: 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్.. మే14న ప్రమాణం !
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం కానున్నారు. గవాయ్ పేరును ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ (Br gawai) నియామకం కానున్నారు. గవాయ్ పేరును ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev khanna) సిఫార్సు చేశారు. ఆయన పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించారు. దీంతో సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే 13తో ముగియనుండగా అదే నెల14వ తేదీన గవాయ్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ గవాయ్ ఆరు నెలల పాటు సీజేఐగా బాధ్యతల్లో ఉండనున్నారు. ఆయన పదవీ కాలం నవంబర్ 23న ముగియనుంది. 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న గవాయ్ ఈ పదవిని నిర్వహించిన రెండో దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. అంతకుముందు దళిత సామాజిక వర్గానికి చెందిన కేజీ బాలకృష్ణన్ సీజేఐ పదవిని చేపట్టారు.
కాగా, 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన గవాయ్ 1985లో ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఆ తర్వాత న్యాయమూర్తిగా ఆయన ముంబై, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీలలో వివిధ బెంచ్‌లలో పనిచేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన పలు కీలక తీర్పుల్లో భాగమయ్యారు.






