బ్రేకప్ చెప్పిందని.. కత్తితో పొడిచి యువతిని చంపిన ప్రియుడి సోదరుడు

by Ramesh Naini |

పెళ్లై, విడాకులు తీసుకున్న విషయాన్ని దాచి ప్రేమించాడని బ్రేకప్ చెప్పినందుకు ఓ యువతి దారుణ హత్యకు గురైంది.

బ్రేకప్ చెప్పిందని.. కత్తితో పొడిచి యువతిని చంపిన ప్రియుడి సోదరుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లై, విడాకులు తీసుకున్న విషయాన్ని దాచి ప్రేమించాడని బ్రేకప్ చెప్పినందుకు ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియుడి సోదరుడు ఆమెను కత్తితో పొడిచి చంపిన ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడిహళ్లి ప్రాంతానికి చెందిన అమృత ‘లా’ చదువుతూనే ఓ పిజ్జా అవుట్‌లెట్‌లో పార్ట్‌-టైమ్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ధనుష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే, ధనుష్‌కు అప్పటికే పెళ్లై, విడాకులు అయ్యాయని, ఓ బిడ్డ కూడా ఉన్నాడన్న నిజం తెలియడంతో అమృత అతనికి బ్రేకప్ చెప్పేసింది.

కోపం పెంచుకున్న సోదరుడు..

అమృత నిర్ణయంపై కోపం పెంచుకున్న ధనుష్ సోదరుడు సూర్య.. ఆమెను పలుమార్లు బెదిరించాడు. జులై 13న ఆమె ఇంటి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహంతో అమృత ఛాతి, వీపుపై కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన అమృత.. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మృతి చెందింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సూర్యతో పాటు అతడి సోదరుడు ధనుష్‌ను కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు.

Next Story