- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలకు రూ.3.5 లక్షలు ఇస్తున్నా.. రష్యా మహిళపై ప్రియుడు షాకింగ్ కామెంట్స్
ఇటీవల కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఓ గుహలో పోలీసులు రష్యా మహిళ నీనా కుటినాను గుర్తించిన సంగతి తెలిసిందే. పిల్లలతో కలిసి అడవిలో మహిళ దీన స్థితిలో ఉండటం చూసి పోలీసులు స్టేషన్ కు తరలించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఓ గుహలో పోలీసులు రష్యా మహిళ నీనా కుటినాను గుర్తించిన సంగతి తెలిసిందే. పిల్లలతో కలిసి అడవిలో మహిళ దీన స్థితిలో ఉండటం చూసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాల కోసం ఆరా తీయగా ప్రియుడు డ్రోర్ గోల్డ్ స్టెనిన్ గురించి తెలిసిందే. అతడికి సమాచారం అందడంతో గురువారం ఇజ్రాయెల్ నుండి బెంగుళూరుకు చేరుకున్నాడు. కాగా అతడు కీలక విషయాలు చెప్పాడు. గోవాలో నీనాతో కలిసి తాను ఒక కంపెనీలో పనిచేసినట్టు తెలిపాడు.
ఆ సమయంలోనే ఇద్దరం ప్రేమించుకున్నామని, ఇద్దరు కుమార్తెలు జన్మించారని చెప్పాడు. పిల్లలు జన్మించిన తరవాత కూడా కలిసి ఉన్నామని అన్నాడు. తాను పనిపై గతేడాది ఇజ్రాయెల్ వెళ్లానని అక్కడ నుండి తరచూ ఫోన్ మాట్లాడుకునేవాళ్లమని అన్నాడు. కుటుంబ నిర్వహణ కోసం నెలకు రూ.3.5 లక్షలు పంపేవాడినని తెలిపాడు. మార్చి నుండి నీనా తనకు ఫోన్ చేయడం లేదని దీంతో తాను పనాజీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు. గోకర్ణ సమీపంలోని గుహలో రహస్యంగా జీవిస్తున్న నీనాను పోలీసులు రక్షించారని తెలిసి వచ్చానని అన్నాడు. తన పిల్లలను ప్రకృతి మధ్య పెంచాలని తరచూ చెప్పేదని అందుకే అడవిలోకి వెళ్లి ఉండొచ్చని స్టెనిన్ వెల్లడించాడు.






