బాయ్ ఫ్రెండ్ కిడ్నాప్.. రెండున్నర కోట్లు డిమాండ్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

by Naga Rani Yarlagadda |

పెళ్లయ్యాక మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అడ్డుగా ఉన్నారని జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

బాయ్ ఫ్రెండ్ కిడ్నాప్.. రెండున్నర కోట్లు డిమాండ్ చేసిన గర్ల్ ఫ్రెండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లయ్యాక మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అడ్డుగా ఉన్నారని జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా డబ్బు కోసం ఏ ప్రేయసి చేయని పనిచేసిందో యువతి. తన బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేయించి.. రూ.2.5 కోట్లు డిమాండ్ చేసింది. ఈ సంచలన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

దుబాయ్ ట్రావెల్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న లారెన్స్ మెల్విన్ ఇటీవల తన సొంత ఊరైన బెంగళూరుకు వచ్చాడు. ఈనెల 16 నుంచి అతను మిస్ అవ్వడంతో.. అతని తల్లి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లారెన్స్ ను కిడ్నాప్ చేసిన దుండగులు రూ.2.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇందులో లారెన్స్ ప్రేయసి అయిన మహిమా కుట్ర ఉందని తేల్చారు.

జులై 14న మహిమ.. లారెన్స్ ను బయటకు వెళ్దామని అడగ్గా.. ఇద్దరూ కార్ బుక్ చేసుకుని బయల్దేరారు. కొంతదూరం వెళ్లాక ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న లారెన్స్ పై దాడి చేసి.. రూ.1 లక్ష లాక్కున్నారు. అనంతరం అతన్ని ఒక అపార్టుమెంటులో బంధించి.. 8 రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. లారెన్స్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారు. కాగా.. ఆ అపార్టుమెంటులో ఉంటోన్న మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి.. లారెన్స్ ను రక్షించారు. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. సూత్రధారి అయిన మహిమ, మరో ముగ్గురు పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story