ఉభయ సభలు రేపటికి వాయిదా

by Muthe.Rajitha |   (  Updated:2025-07-24 09:56:17  IST  )

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Sessions) గందరగోళం కొనసాగుతోంది.

ఉభయ సభలు రేపటికి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Sessions) గందరగోళం కొనసాగుతోంది. విపక్ష పార్టీల ఆందోళనల కారణంగా లోక్‌సభ(Loksabha), రాజ్యసభ(Rajyasabha) రేపటికి వాయిదా పడ్డాయి. ఇండియా కూటమి నేతలు బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), గోవా అసెంబ్లీలో ST లకు సీట్లు రిజర్వ్ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలకు దిగారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ హరివంశ్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో ఇరు సభలు రేపటికి వాయిదా వేశారు.

Next Story