- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Barder village: అప్పుడే వెనక్కి రావొద్దు.. సరిహద్దు గ్రామాల ప్రజలకు వార్నింగ్
భారత్ పాక్ మధ్య ఉద్రక్తతల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు కశ్మీర్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ (India pakisthan) మధ్య ఉద్రక్తతల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. బార్డర్‌కు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు అప్పుడే ఇళ్లకు తిరిగి రావొద్దని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, తొందరపడి వెనక్కి రావొద్దని సూచించారు. పాకిస్తాన్ దాడి తర్వాత గ్రామాల్లో మందుగుండు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉందని, వాటి వల్ల పౌరులకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఎటువంటి నష్టం జరగకుండా ప్రభావిత ప్రాంతాలను శుభ్రపరచడానికి బాంబు స్య్కాడ్ బృందాలను పంపుతామని వెల్లడించారు. ఈ కార్యకలాపాలు పూర్తయ్యే వరకు ఇళ్లకు రావొద్దని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌పై దాడులు చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభం కాగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగపడింది. ఇక్కడ ఘర్షణ ఎక్కువ కావడంతో సరిహద్దు గ్రామాల్లోని సుమారు లక్ష మందికి పైగా తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ప్రధానంగా బారాముల్లా, బందిపోరా, కుప్వారా జిల్లాల్లోని ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉండటంతో వీరంగా తిరిగి వచ్చే అవకాశం ఉండటంతొ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.






