- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాతో బోర్డర్ సమస్యే అతిపెద్ద సవాల్: సీడీఎస్ అనిల్ చౌహాన్
చైనాతో బోర్డర్ సమస్యే అతిపెద్ద సవాల్ అని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. భారత్-చైనా సంబంధాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.

దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్మీ చీఫ్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో ఉన్న సరిహద్దు సమస్య భారత్‌కు ఉన్న అతిపెద్ద సవాల్ అని అనిల్ చౌహాన్ అన్నారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. చైనా తర్వాత పాకిస్తాన్ చేస్తున్న ప్రాక్సీ యుద్ధం రెండో అతిపెద్ద సవాల్ అని చౌహాన్ వివరించారు.
‘దేశాల ముందుండే సవాళ్లు క్షణంలో ముగిసేవి కాదు. వివిధ రూపాల్లో ఉంటాయి. నన్నడిగితే చైనాతో ఉన్న బోర్డర్ సమస్య.. మన దేశం ముందున్న అతిపెద్ద సవాల్. మన ఇద్దరు శత్రువులు న్యూక్లియర్ పవర్ ఉన్న దేశాలే. అలాంటి శత్రువులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టాలనేది ఎప్పటికీ సవాళ్లతో కూడిన నిర్ణయమే’ అని చౌహాన్ చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయ స్థిరత్వం కూడా మరో సమస్యేనని సీడీఎస్ పేర్కొన్నారు.






