- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kunal Kamra: కునాల్ కామ్రాకు షాక్ ఇచ్చిన బుక్ మై షో
ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో నిలిచారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో నిలిచారు. కాగా.. ఆయనకు ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో షాక్(Book My Show) ఇచ్చింది. తమ ప్లాట్‌ఫారమ్‌పై కళాకారుల జాబితా నుంచి ఆయన్ని తొలగించడమే కాకుండా, ఆయన కంటెంట్ ను సైతం వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసింది. ఈ విషయాన్ని శివసేన కార్యకర్త రాహుల్ కునాల్ వెల్లడించారు. ప్రస్తుతం బుక్ మై షో క్లీన్ గా మారిందని రాహుల్ చెప్పుకొచ్చారు. కునాల్ కామ్రాను ఆర్టిస్టుల జాబితా నుంచి తొలగించినందుకు సంస్థ సీఈవో ఆశిష్ హేమరాజనికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. "మీ సేల్స్ అండ్ ప్రమోషన్ జాబితా నుండి ఆ ఆర్టిస్టుని తొలగించినందుకు మీకు, మీ బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బుక్ మై షో సెర్ట్ హిస్టరీ నుంచి కూడా అతడ్ని తొలగించినందుకు సంతోషం. శాంతిని కాపాడటం, అలానే మా భావోద్వేగాలను గౌరవించడంలో కీలక పాత్ర పోషించారు. ముంబై వాసులు వ్యక్తిగత అజెండాలను కాకుండా ప్రతి రకమైన కళను ప్రేమిస్తారు. మీ దృష్టి, నాయకత్వం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీ బృందం మాకు గైడెన్స్ అందించి వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు.” అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.
స్పందించిన బుక్ మై షో
బుక్ మై షో బృందాన్ని సంప్రదించగా.. ప్రస్తుతం వారి పోర్టల్‌లో కునాల్ కమ్రా వీడియోలు లేవని, అలాగే భవిష్యత్‌లో కూడా ఆయనకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్‌లు ఉండవని స్పష్టం చేసింది. మరోవైపు, ఈ వివాదంపై కునాల్ కామ్రా స్పందించారు. తన షోలను జాబితా చేయగలరా లేదా అని ధృవీకరించమని బుక్‌మైషోను కోరారు. ఒకవేళ తన షోలను ప్రమోట్ చేయకపోతే.. తాను అర్థం చేసుకోగలనని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇటీవలే ముంబై యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామెడీ స్టూడియోలో కునాల్ కామ్రా కామెడీ షో నిర్వహించి దాన్ని రికార్డు చేశారు. అందులో షిండేను‘‘గద్దార్’’ (ద్రోహి) తో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని లిరిక్స్ ని పాలిటిక్స్ కు అనుకూలంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. ఇది వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.






