- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో బుక్ ఫెయిర్.. ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకం.. ధర వింటే షాక్ అవ్వాల్సిందే!
ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకం బీహార్‌లో ఆవిష్కృతమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకం బీహార్‌లో ఆవిష్కృతమైంది. ఆదివారం బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన బుక్ ఫెయిర్‌లో ఓ పుస్తకం ధర అక్షరాల రూ. 15 కోట్ల రూపాయలు. అవును మీరు విన్నది నిజమే. ఆ పుస్తకం పేరు మై. అంటే తెలుగులో ‘నేను’ అని అర్థం. దీని రచయిత బిహార్‌కు చెందిన రత్నేశ్వర్.. అయితే, ఈ పుస్తకాన్ని 16 కాపీలు మాత్రమే ముద్రించారు. వీటిలో 11 బుక్స్‌ను ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. మరో 3 పుస్తకాలను మాత్రమే విక్రయానికి ఉంచారు. ఈ గ్రంథం జీవన తత్వాన్ని వివరిస్తుందని పుస్తక రచయిత రత్నేశ్వర్ అంటున్నారు.
పుస్తక ధరను నేను కాదు, దేవుడే నిర్ణయించాడు.. పుస్తక రచయిత
పుస్తక ఆవిష్కరణ సభలో రత్నేశ్వర్ మాట్లాడుతూ.. పుస్తక ధరను నేను కాదు, దేవుడే నిర్ణయించాడు అని అన్నారు. నా తత్వశాస్త్రం, నా ప్రయాణం నాకు ఈ ఖర్చును తెచ్చిపెట్టింది. ఆ ఆలోచన నన్ను పుస్తకం ధరను రూ.15 కోట్లు పెట్టమని ప్రేరేపించిందని తెలిపారు. పుస్తకం ధర ఎక్కువ అనుకుంటే దీన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. పుస్తకంలో లోతైన వ్యక్తిగత ఆధ్యాత్మిక మేల్కొలుపు ఉందన్నారు. ఈ పుస్తకంలో అత్యున్నత జ్ఞాన స్థితిని కనుగొనవచ్చు.. అదే ప్రాథమిక అంశం అని వివరించారు. ఉదాహరణకు గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందింది మీరు వినే ఉంటారు.. అయితే ఆయన జ్ఞానోదయం పొందారని ధృవీకరించబడిన ఆ స్థితి ఏమిటి? ఈ పుస్తకం ఆ స్థితి గురించి చెబుతుందని, ఇలాంటి పుస్తకం ప్రపంచంలోనే మొదటిది అని చెప్పుకొచ్చారు.
కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిసెంబర్ 5న 41వ పాట్నా పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఇది డిసెంబర్ 16 వరకు బుక్ ఫెయిర్ కొనసాగనుంది.






