దేశవ్యాప్తంగా మాంసాహారంపై నిషేధం విధించాలి.. నటుడు సంచలన డిమాండ్.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా(Shatrughan Sinha) నటుడిగా పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.

దేశవ్యాప్తంగా మాంసాహారంపై నిషేధం విధించాలి.. నటుడు సంచలన డిమాండ్.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా(Shatrughan Sinha) నటుడిగా పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆయన రాజకీయవేత్తగా రాణిస్తూనే పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల శత్రుఘ్న సిన్హా నిత్యం పలు వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఆయన దేశవ్యాప్తంగా మాంసాహారం నిషేధించాలని డిమాండ్ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. దానికి కారణం ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలులోకి తీసుకురావడంతో ఆయన ఇలాంటి కామెంట్స్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం శత్రుఘ్న సిన్హాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

‘‘యూనిఫాం సివిల్ కోడ్‌లో కొన్ని లొసుగులు ఉన్నాయి. యూసీసీ నిబంధనలను రూపొందించే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఇక ఉత్తరాఖండ్‌లో ప్రాథమిక స్థాయిలో UCC అమలు చేసినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది నా డిమాండ్. అలాగే దేశంలో గొడ్డు మాంసం మాత్రమే కాదు, అన్ని రకాల మాంసం వినియోగాన్ని నిషేధించాలి. ఉత్తర భారతదేశంలో అమలు చేస్తోన్న నియమాలను ఈశాన్య రాష్ట్రాల్లో విధించలేం’’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ వీడియో చూసిన వారంతా మండిపడుతున్నారు. ముఖ్యంగా ముక్క లేనిదే ముద్ద దిగదు అనే నాన్‌వెజ్ ప్రియులు దారుణంగా నటుడిని ట్రోల్ చేస్తున్నారు. ఏవి తినాలో, ఏ ఆహారాలు తినకూడదో మీరు చెబుతారా? ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు చేస్తున్నారు. కాగా, శత్రుఘ్న ఇటీవల తన కూతురు సోనాక్షి సిన్హా పెళ్లిపై వచ్చిన కామెంట్లపై కూడా ఊహించని విధంగా స్పందించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆయన గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నెట్టింట మాత్రం సెన్సేషన్‌గా మారారు.

Next Story