శిల్పాశెట్టి దంపతులకు బాంబే హైకోర్టులో చుక్కెదురు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-08 10:20:30  IST  )

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా దంపతులకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది.

శిల్పాశెట్టి దంపతులకు బాంబే హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా దంపతులకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఈ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా వారి పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. దానిని కొట్టివేసింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దేశం విడిచి మరో దేశానికి వెళ్లాలంటే.. రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని తెలిపింది.

కాగా.. ఒక యూట్యూబ్ ఛానల్ ను నిర్వహించేందుకు శిల్పాశెట్టి అక్టోబర్ 25, 29 తేదీల్లో కొలంబో వెళ్లాల్సి ఉంది. లుకౌట్ నోటీసులు ఉన్న క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరగా.. శిల్ప తరపు లాయర్ ను కోర్టు.. ఈవెంట్ నిర్వాహకులు ఆహ్వానించారా ? అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఫోన్ కాల్ మాత్రమే చేశారని, కోర్టు అనుమతిస్తే.. అధికారికంగా ఆహ్వానం అందుతుందని చెప్పారు.

Read More: ముందు రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి.. శిల్పా శెట్టి దంపతులకు బాంబే హైకోర్టు హెచ్చరిక"

Next Story