భార్య సెక్స్‌కు నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఈ మధ్య కాలంలో భారతదేశంలో విడాకుల సంస్కృతి గణనీయంగా పెరుగుతోంది.

భార్య సెక్స్‌కు నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో భారతదేశంలో విడాకుల సంస్కృతి గణనీయంగా పెరుగుతోంది. సాంప్రదాయ విలువలు, ఆధునిక జీవనశైలి, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి అంశాలు విడాకులు తీసుకునే విషయంలో కీలకంగా మారాయి. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత, మానసిక రుగ్మతలు దంపతులను ఆ దిశగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు (Mumbai High Court) సంచలన తీర్పును వెలువరించింది. ఫ్యామిలీ కోర్టు తనకు మంజూరు చేసిన విడాకులను రద్దు చేయాలని కోరుతూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను జస్టిస్ రేవతి మోహితే-దేరే (Revathi Mohite-Dere), డాక్టర్ నీలా గోఖలే (Dr.Neela Gokhale) ధర్మాసనం తోసిపుచ్చింది. భర్తతో సెక్స్‌కు సహకరించపోవడం నేరం కిందకే వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని ఇతరుల ముందు అనుమానించడం, పుకారు చేయడం లాంటివి క్రూరత్వం కిందకు వస్తాయని తెలిపింది. ఇవన్నీ హిందూ వివాహ చట్టం (Hindu Marriage Act)లో పొందుపరిచి ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. అయితే, పిటిషనర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె తనకు నెలకు రూ.లక్ష భరణం చెల్లించాలని మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story