- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bombay HC: షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. కునాల్ కామ్రాకు స్వల్ప ఊరట
ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు(Kunal Kamra) స్వల్ప ఊరట దక్కింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) పై కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రాకు(Kunal Kamra) స్వల్ప ఊరట దక్కింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) పై కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా.. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ కామ్రా బాంబే హైకోర్టుని(Bombay High Court) ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. కామ్రాకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఏప్రిల్ 16 వరకు కామ్రాకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై కేసు కొట్టేయాలంటూ కుణాల్ వేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని కోరింది.
కునాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవలే ముంబైలో కునాల్ కామ్రా కామెడీ షో నిర్వహించి దాన్ని రికార్డు చేశారు. అందులో షిండేను‘‘గద్దార్’’ (ద్రోహి) తో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని లిరిక్స్ ని పాలిటిక్స్ కు అనుకూలంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. ఇది వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్ స్టూడియోపై దాడి చేసి వేదికను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే, కునాల్ కమ్రామ షిండేకు క్షమాపణలు చెప్పాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. అయితే, దీనిపైనా కునాల్ స్పందించారు. ఈ వ్యవహారంతో పశ్చాత్తాప పడట్లేదని.. కోర్టు ఆదేశిస్తే క్షమాపణలు చెబుతానని అన్నారు. కాగా.. షిండేపై వ్యాఖ్యల నేపథ్యంలో కునాల్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం పోలీసులు ఆయనకు మూడుసార్లు సమన్లు జారీ చేశారు. అయితే, ఆయన మాత్రం విచారణ కు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించగా.. స్వల్ప ఊరట దక్కింది.






