ఢిల్లీలోని యూనివర్సిటీ కళాశాలలకు బాంబు బెదిరింపులు

by Malleboina Mahesh |

గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలోని అనేక బాంబు బెదిరింపులు నమోదవుతున్నాయి. ఎర్రకోట సమీపంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అధికారులు ఫేక్ బెదిరింపులను సైతం సీరియస్ గా తీసుకుంటున్నారు.

ఢిల్లీలోని యూనివర్సిటీ కళాశాలలకు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలోని అనేక బాంబు బెదిరింపులు నమోదవుతున్నాయి. ఎర్రకోట సమీపంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అధికారులు ఫేక్ బెదిరింపులను సైతం సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించి బెదిరింపులను ఫేక్ గా నిర్ణయిస్తున్నారు. అయినప్పటికి దుండగులు కంటిన్యూగా ఈ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయ కళాశాలలైన రామ్‌జాస్ కాలేజ్ (Ramjas College), దేశ్‌బంధు కాలేజ్ (Deshbandhu College) లకు ఈ రోజు ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు (Bomb threats) వచ్చాయి.

ఈ బెదిరింపులు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ (Bomb squad,), డాగ్ స్క్వాడ్, ఢిల్లీ పోలీసులు హుటాహుటిన ఆయా క్యాంపస్‌లకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే కళాశాలల్లోకి విధ్యార్థులకు, ఇతరులకు ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం పోలీసులు వెంటనే రెండు క్యాంపస్‌ల అంతటా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బెదిరింపు మెయిల్‌లో, "పాక్ ISI సెల్‌ల సహకారంతో ఈ పేలుడు చర్యకు ప్లాన్ చేశామని" పేర్కొన్నారు.

అయితే, ఢిల్లీ పోలీసులు (Delhi Police) తెలిపిన వివరాల ప్రకారం, "ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు". దీంతో ఈ బెదిరింపులు బూటకమని పోలీసులు తేల్చారు. కాగా గత కొంతకాలంగా ఢిల్లీలోని పలు పాఠశాలలు, కోర్టులు, విద్యా సంస్థలకు ఇ-మెయిల్ ద్వారా ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారిపై దర్యాప్తు చేస్తున్నారు

Next Story