BREAKING: ఇద్దరు మంత్రులు సహా అజిత్, రమ్యకృష్ణ ఇళ్లకు బాంబు బెదిరింపులు

by Naga Rani Yarlagadda |

తాజాగా రాష్ట్రంలో ఇద్దరు రాష్ట్రమంత్రుల ఇళ్లు సహా.. నటీనటులు అజిత్, రమ్యకృష్ణల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

BREAKING: ఇద్దరు మంత్రులు సహా అజిత్, రమ్యకృష్ణ ఇళ్లకు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కారు బాంబు బ్లాస్ట్ ఘటనలో 12 మంది మృతి చెందగా.. ఈ ఘటన యావత్ దేశాన్నీ ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా తమిళనాడులో ఇద్దరు రాష్ట్రమంత్రుల ఇళ్లు సహా.. నటీనటులు అజిత్, రమ్యకృష్ణల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రులు కేఎన్ నెహ్రూ, అన్బిల్ మహేష్ ఇళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వారి ఇళ్లలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి.

నటుడు అజిత్ కుమార్, నటి రమ్యకృష్ణ, నటుడు,రాజకీయ నాయకుడైన ఎస్ వీ శేఖర్ ఇళ్లకు సైతం బాంబు బెదిరింపులు రావడంతో చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ బాంబు బెదిరింపుల కాల్స్ రావడంతో స్నిఫర్ డాగ్ యూనిట్లు, బాంబ్ స్క్వాడ్ వారి ఇళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా బాంబు పెట్టిన ఆనవాళ్లు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. కేవలం ఆగంతకులు తప్పుడు హెచ్చరికలు చేశారని, ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్థారించారు.

Next Story