- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు.. కొనసాగుతోన్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడం బడ్జెట్ సమావేశాల వేళ తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ముంబైలోని అసెంబ్లీకి బాంబు బెదిరింపు రావడంతో ఇవాళ ఉదయం తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. సుమారు 6.27కు అధికారులకు ఓ అజ్ఞాత ఈమెయిల్ వచ్చింది. అందులో అసెంబ్లీతో పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), బాంబే హైకోర్టులను పేల్చివేస్తామని నిందితులు హెచ్చరించారు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), యాంటీ టెర్రర్ యూనిట్లు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి రంగంలోకి దిగారు. విధాన భవన్ పరిసరాలను ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమయంలో మీడియా, సామాన్య ప్రజలను లోపలికి అనుమతించ లేదు. చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్‌ను మళ్లించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చాలాసేపు తనిఖీల అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు ధృవీకరించారు. మహారాష్ట్ర హోం మంత్రి పంకజ్ భోయిర్ మాట్లాడుతూ.. ఈ బెదిరింపు కేవలం వదంతేనని స్పష్టం చేశారు. భద్రతా తనిఖీల అనంతరం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అసలు ఆ ఈ-మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






