- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు.. ISIతో లింక్ ఉన్న టీమ్ నుంచి మెయిల్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాన్ని పేల్చి వేస్తామని దుండగులు బాంబు బెదిరింపు చేసినట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాన్ని పేల్చి వేస్తామని దుండగులు బాంబు బెదిరింపు చేసినట్లు సమాచారం. తిరువనంతపురంలోకి ఆయన ఇల్లు క్లిఫ్ హౌస్ కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
అలాగే ప్రభుత్వ సచివాలయం సమీపంలోని స్పెన్సర్ జంక్షన్లోని సౌత్ ఇండియన్ బ్యాంక్ రెండు శాఖలకు, రాజధానిలోని తంపనూర్లో ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ శాఖలకు కూడా బాంబు బెదిరింపు మెసేజ్ లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, ఈ బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరై కనుగొని, అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 3న జరగనున్న భారత నౌకాదళ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననుండగా.. రెండ్రోజుల ముందే సఎం నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరువనంతపురమంతా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినా.. బాంబు బెదిరింపు రావడం గమనార్హం.
కాగా.. క్లిఫ్ హౌస్ కు బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. సీఎం కార్యాలయానికి వచ్చిన ఈ-మెయిల్ లో LTTE, కరాచీకి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సెల్ తో సంబంధం ఉన్న టీమ్ RDX పేలుడు పదార్థాలను అమర్చినట్లుగా మెయిల్ లో చెప్పినట్లు సమాచారం.






