- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు
భారత దేశంలో ఇటీవల అనేక సంస్థలు, కార్యాలయాలు, విమానాలకు కంటిన్యూగా బాంబ్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో ఇటీవల అనేక సంస్థలు, కార్యాలయాలు, విమానాలకు కంటిన్యూగా బాంబ్ బెదిరింపులు (Bomb threats) వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం కూడా ఇండిగో విమానానికి గుర్తు తెలియని దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఉదయం ముంబై నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో 6E 762 విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని, వెంటనే అప్రమత్తం అయిన అధికారులు బాంబ్ స్క్వాడ్ బృందం (Bomb Squad Team)తో వెళ్లి.. తనిఖీలు చేశారు. బెందిరింపులు వచ్చిన విమానంలో దాదాపు 200 మంది ఉన్నట్లు తెలుస్తుంది.
దీంతో ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport)లో అత్యవసర చర్యలు చేపట్టారు. అయితే విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు లేదని అధికారుల తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ తరహా బెదిరింపులు సాధారణం అయినప్పటికీ, విమానయాన సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను కఠినంగా అమలు చేయించడానికి కారణమవుతాయి. అలాగే ప్రయాణీకులు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ అధికారులు సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి సీరియస్‌గా స్పందిస్తున్నారు.






