- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు
తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబ్ బెదిరింపుల మెయిల్ వచ్చింది. శనివారం రాత్రి విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన నేపథ్యంలో విజయ్ ఇంటికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ (hero Vijay) ఇంటికి బాంబ్ బెదిరింపు (Bomb threat)ల మెయిల్ వచ్చింది. శనివారం రాత్రి విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన నేపథ్యంలో విజయ్ ఇంటికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ రోజు ఉదయం 9. 30 గంటల ప్రాంతాలో చెన్నైలోని ECR, Neelankarai లోని విజయ్ నివాసంలో బాంబులు పెట్టినట్లు దుండగులు రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈ–మెయిల్ చేశారు. అలాగే విజయ్ ఇంట్లోని టెలిఫోన్ కి కాల్ చేసి.. మరికొద్ది సేపట్లో ఇంటిని కూల్చేస్తున్నామని బెదిరించారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ (Bomb Disposal Squad)తో వెళ్లి ఇంటి లోపల, బయట అణువణువున తనిఖీ చేసింది.
అయితే హీరో విజయ్ ఇంట్లో ఎటువంటి బాంబులు, వాటి ఆనవాల్లు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఏవరు. ఏ ఉద్దేశ్యంతో ఈ బెదిరింపులకు పాల్పడాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొక్కిసలాట తర్వాత విజయ్ ఇంటి ముందు అనేక విద్యార్థి సంస్థలు ధర్నాలు చేయడం, తాజాగా బాంబు బెదిరింపులు రావడంతో.. అప్రమత్తం అయిన అధికారులు హీరో విజయ్ సురక్షిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఇంటి సమీప ప్రాంతాల్లో తాత్కాలికంగా కొన్ని నిబంధనలు అమలు చేశారు.






