- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ రావడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉదయం చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ రావడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉదయం చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అల్వార్ పేటలోని సీఎం స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్టు అతడు పోలీసులను బెదిరించాడు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఇంట్లో, బయట అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పరిసర ప్రాంతాల్లోని భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. సుమారు గంటన్నర పాటు బాంబు డిస్పోజల్ మరియు డిటెక్షన్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఏమీ లేని తేల్చారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ పేలుడు పదార్థాలు కానీ లభ్యం కాలేదన్నారు. బెదిరింపు కాల్ అని స్పష్టం చేశారు. ఆ కాల్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ వచ్చిన నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో, టీవీఎం అధినేత విజయ్‌కి సైతం ఇటీవల ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన నివాసంలోనూ ఏమీ లభ్యం కాలేదు.






