పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు.. కొనసాగుతోన్న తనిఖీలు

by Kema Shiva Kumar |

పహల్గాం టెర్రర్ అటాక్‌ (Pahelgam Terror Attack) నేపథ్యంలో దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది.

పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు.. కొనసాగుతోన్న తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్‌ (Pahelgam Terror Attack) నేపథ్యంలో దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ భయం అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) హైకోర్టు (High Courts)కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో కోర్టు పరిధిలో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వస్తువును చెక్ చేస్తున్నారు. అనంతరం కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆవరణలో ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలని, చుట్టు పక్కల పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు లేదా బార్ అసోసియేషన్‌లో సమాచారం అందజేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా నేటి కోర్టు కార్యకలాపాలు మధ్యాహ్న భోజనం తరువాత 2 గంటలకు పున:ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Next Story