- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూటు మార్చిన ఆగంతకులు.. PTI వార్త సంస్థకు బాంబు బెదిరింపు
ఇన్నాళ్లు న్యాయస్థానాలు, పాఠశాలలు, సెలబ్రిటీల ఇళ్లకే పరమితమైన బాంబు బెదిరింపు కాల్స్ వార్త సంస్థలకు కూడా పాకాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇన్నాళ్లు న్యాయస్థానాలు, పాఠశాలలు, సెలబ్రిటీల ఇళ్లకే పరమితమైన బాంబు బెదిరింపు కాల్స్ ప్రస్తుతం వార్త సంస్థలకు కూడా పాకాయి. తాజాగా ఇవాళ ఉదయం చెన్నై (Chennai)లోని కోడంబాక్కం (Kodambakkam)లో ఉన్న ప్రముఖ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI)కు ఓ ఆగంతకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కార్యాలయంలో బాంబు పెట్టామని.. అది కాసేపట్లో పేలబోతోందని అపరిచితుడు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వారు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్వ్కాడ్‌తో స్పాట్‌కు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ముందుగా పీటీఐ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపి అనుమానం వచ్చిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తాము చెప్పే వరకు ఎవరూ ఆఫీస్ పరిసరాల్లోకి రావొద్దంటూ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






