Bomb threat: హర్యానా సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు

by Shamantha N |

హర్యానా సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సీఎం కార్యాలయ భవనానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.

Bomb threat: హర్యానా సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సీఎం కార్యాలయ భవనానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. కేంద్ర బలగాలు, హర్యానా పోలీసులు, చండీగఢ్ పోలీసులు సచివాలయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ టీమ్స్ కూడా సచివాలయం చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని కూడా తనిఖీ చేశాయి. ఇకపోతే, భద్రతా సంస్థలు మే 31 సాయంత్రం పాకిస్థాన్ తో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కాగా.. మాక్ డ్రిల్‌కు ఒక రోజు ముందు బాంబు బెదిరింపు కాల్ రావడం గమనార్హం. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్ లలో మాక్ డ్రిల్ జరగనుంది. సరిహద్దు ప్రాంతాల్లో సంసిద్ధతను పెంచడం, అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ డ్రిల్ నిర్వహించనున్నారు.

Next Story