- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bomb Threat: జోతిష్యుడే నిందితుడు.. ముంబయి బాంబు బెదిరింపు కేసులో ఊహించని ట్విస్ట్
ముంబయి బాంబు బెదిరింపులు కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబయిలోకి చొరబడిన 14 మంది ఉగ్రవాదులు 400 కిలోల ఆర్డీఎక్స్ దాడి చేయబోతున్నారంటూ అగంతకుడి నుంచి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు బెదింపు (Mumbai bomb threat) మెయిల్స్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలింసిందే. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. తనపై కేసు పెట్టిన స్నేహితుడిని ఇరికించేందుకే ఓ వ్యక్తి ఈ ఫేక్ మెయిల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా మెయిల్స్ పంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వినాయక నిమజ్జనం వేడుకల్లో పేలుళ్లు జరిపేందుకు పాకిస్తాన్ కు చెందిన లష్కర్ ఏ జిహాదీకి చెందిన ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారంటూ నిన్న బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు నగరం అంతటా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయితే తాజాగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడు చెప్పిన విషాలకు షాక్ తిన్నారు.
జైలుకు పంపాడని కోపం..
బిహార్ లోని పాటలీపుత్రకు చెందిన అశ్విని (Ashwini Kumar) కుమార్ గత ఐదేళ్లుగా నోయిడాలో నివసిస్తున్నాడు. వృత్తి రీత్యా జోతిష్యుడు అయిన అశ్విని కుమార్ పై 2023లో ఓ వివాదం విషయంలో అతడి స్నేహితుడు ఫిరోజ్ కేసు పెట్టాడు. ఈ అంశంలో అశ్వినీ కుమార్ 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి తనపై కేసు పెట్టిన ఫిరోజ్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న అశ్వినీ కుమార్.. మంచి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఈ క్రమంలో శనివారం ముంబయిలో వినాయక నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో బాంబు బెదిరింపులు వస్తే కఠిన శిక్ష పడుతుందనే ఆలోచ నతోనే తన స్నేహితుడి పేరుతో ఈ బెదిరింపులకు పాల్పడినట్లు అశ్విని కుమార్ పోలీసులకు వెల్లడించారు. బెదింపుల నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు నోయిడాలో ఉన్న అశ్విని కుమార్ ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఆర్ మెమరీ కార్డు హోల్డర్లు, రెండు డిజిటల్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నోయిడా నుంచి నిందితుడిని ముంబయికి తీసుకువస్తున్నారు.






