- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం.. సీఎం కార్యాలయం, బీఎస్‌ఈ టార్గెట్
ముంబైలోని సీఎం కార్యాలయం, మేయర్ ఆఫీస్, బీఎస్‌ఈ భవనాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు రావడం కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ముంబై మహా నగరంలోని పలు కీలక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. సీఎం కార్యాలయం (CMO), ముంబయి మేయర్ కార్యాలయం, ప్రతిష్టాత్మక బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) భవనంతో పాటు పలు కీలక ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. అదేవిధంగా బృహన్ ముంబయి కార్పొరేషన్ (BMC) అధికారిక ఈమెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు సందేశాలు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, ఈ బెదిరింపు ఈమెయిళ్లలో ఖలిస్థాన్ ప్రస్తావన ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఏదైనా ఉగ్రవాద సంస్థ దీని వెనుక ఉందా.. లేక ఎవరైనా ఆకతాయిలు కావాలనే చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
భద్రత మరింత కట్టుదిట్టం..
బాంబు బెదరింపు ఈ-మెయిళ్లు అందిన వెంటనే ముంబయి పోలీసులు, భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్‌లతో కలిసి సదరు కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలోని అన్ని ప్రధాన ఆఫీసులు, సున్నితమైన ప్రాంతాల వద్ద భద్రతను భారీగా పెంచారు. తాజాపై ముంబయి సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి, బెదిరింపు ఈ-మెయిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే ఐపీ అడ్రస్ (IP Address) ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.






